బైక్ దొంగల ముఠా అరెస్ట్.. ఛేదించిన బైంసా పోలీసులు..

దిశ, ముధోల్: ఆదివారం భైంసా పట్టణంలోని ఓల్డ్ ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శ్రీకాంత్, అబ్బులు అనే ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ బైక్ ను పట్టుకొని విచారించగా బైకు దొంగలించే ముఠా గా తేలింది. ఇదే విషయపై సోమవారం భైంసా పట్టణంలోని డీఎస్పి కార్యాలయంలో ఏఎస్పీ కిరణ్ కారే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా యెడపల్లి శ్రీకాంత్, అబ్బులు గత కొంత కాలం బైకులు దొంగిలించి యెడపల్లికి తరలించి […]

Update: 2021-12-06 03:45 GMT

దిశ, ముధోల్: ఆదివారం భైంసా పట్టణంలోని ఓల్డ్ ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శ్రీకాంత్, అబ్బులు అనే ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ బైక్ ను పట్టుకొని విచారించగా బైకు దొంగలించే ముఠా గా తేలింది. ఇదే విషయపై సోమవారం భైంసా పట్టణంలోని డీఎస్పి కార్యాలయంలో ఏఎస్పీ కిరణ్ కారే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా యెడపల్లి శ్రీకాంత్, అబ్బులు గత కొంత కాలం బైకులు దొంగిలించి యెడపల్లికి తరలించి విక్రయిస్తున్నారని తెలిపారు. అక్కడ శ్రీకాంత్, రవికాంత్, శివాజీ అనే ముగ్గురి వ్యక్తులు వీటిని కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు.

భైంసా పోలీసులు యెడపల్లి వద్ద మొత్తం 13 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న భైంసా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ, కానిస్టేబుల్స్ లను ఏఎస్పీ కారే అభినందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్లే ఈ కేసును చాలా సులువుగా పరిష్కరించామని తెలిపారు. పట్టణం మొత్తం సీసీ కెమెరాలు నిఘాలో ఉందని అన్నారు.

Tags:    

Similar News