చాలా రోజులుగా రెక్కీ.. బ్యాంక్ రాబరీలకు ప్లాన్

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్ధపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు బ్యాంక్ దోపిడీ చేసింది యూపీ, మహారాష్ట్ర ముఠాలుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలో కూడా ఇదే తరహాలో రాబరీలు చేసినట్టు గుర్తించిన రామగుండం పోలీసులు అలెర్ట్ అయ్యారు. మహారాష్ట్ర పోలీసులు కూడా దోపిడీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా దోపిడీలకు ప్లాన్ చేస్తే వీరితో మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర ముఠా చేతులు కలిపినట్టుగా తెలుస్తోంది. రాబరీకి నేపాల్ […]

Update: 2021-04-07 06:39 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్ధపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు బ్యాంక్ దోపిడీ చేసింది యూపీ, మహారాష్ట్ర ముఠాలుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలో కూడా ఇదే తరహాలో రాబరీలు చేసినట్టు గుర్తించిన రామగుండం పోలీసులు అలెర్ట్ అయ్యారు. మహారాష్ట్ర పోలీసులు కూడా దోపిడీ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా దోపిడీలకు ప్లాన్ చేస్తే వీరితో మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర ముఠా చేతులు కలిపినట్టుగా తెలుస్తోంది. రాబరీకి నేపాల్ సరిహద్దులోని బదయో జిల్లా కు చెందిన ముఠా గా పోలీసులు భావిస్తున్నారు. చంద్రపూర్ జిల్లా వరోరా, గుంజపడుగు బ్యాంక్ తరహాలోనే లాకర్లు గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దోపిడీ చేశారు.

మహారాష్ట్ర లోని గోందియా, చంద్రపూర్ లో తమకు సహకరించే వారిని కలుపుకుని ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఓ ముఠాను ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గ్యాస్ సిలిండర్లు తీసుకువచ్చిన ట్రాలీని చంద్రపూర్ పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. గుంజపడుగు బ్యాంక్ దోపిడీకి పాల్పడిన ముఠా నేపాల్ కి పరారైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ దోపిడీకి సహకరించే ముఠాలకు పెద్దమొత్తంలో యూపీ గ్యాంగ్ నజరానా కూడా ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గుంజపడుగు బ్యాంక్ దొంగతనం కంటే ముందు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్నారు. దొంగల ముఠా కోసం రామగుండం పోలీసులు మహారాష్ట్ర, యూపీలకు వెల్లినట్టు తెలుస్తోంది.

ఇద్దరితో గుట్టు.. రట్టు

బ్యాంక్ రాబరీలకు పాల్పడే ముఠా గుట్టు ఇద్దరితో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర లోని చంద్రపూర్ పోలీసులు అనుమానం వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయాలు బయటపడ్డాయి.

Tags:    

Similar News