సామాజిక కార్యక్రమాలు భేష్

దిశ, హైదరాబాద్: ఒకప్పుడు కూటికి లేక అల్లాడిన రమేష్ నాయక్ ప్రస్తుతం తన ఆదాయంలో 30 శాతం వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. బంజారారత్న స్వామి నాయక్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రమేష్ నాయక్‌ను హ్యాపీ లైఫ్ ఫౌండేషన్, ఎస్ఎంఎస్ మీడియా సర్వీస్, రమేష్ నాయక్ యువ సైన్యం ఆధ్వర్యంలో బంజారాహిల్స్ షాహిల్లా ప్లాజాలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించడం, దిక్కులేని […]

Update: 2020-03-04 07:47 GMT

దిశ, హైదరాబాద్:
ఒకప్పుడు కూటికి లేక అల్లాడిన రమేష్ నాయక్ ప్రస్తుతం తన ఆదాయంలో 30 శాతం వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. బంజారారత్న స్వామి నాయక్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రమేష్ నాయక్‌ను హ్యాపీ లైఫ్ ఫౌండేషన్, ఎస్ఎంఎస్ మీడియా సర్వీస్, రమేష్ నాయక్ యువ సైన్యం ఆధ్వర్యంలో బంజారాహిల్స్ షాహిల్లా ప్లాజాలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించడం, దిక్కులేని వృద్ధులకు, కడు పేదరికంలో ఉన్న విద్యార్థులకు, ఒంటరి మహిళలకు, పేదల పెళ్ళిళ్ళలకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా.. అనేక వైద్య, రక్తదాన శిబిరాలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు యనమల సిరి, ఎస్ఎంఎస్ రాజు, చిన్నా, మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags : banjara, social activities, happy life foundation

Tags:    

Similar News