‘ఏక్ నంబర్ చోర్ హరీశ్ రావు’

దిశ, సిద్దిపేట : అబద్దాలను అందంగా ప్రచారం చేయడంలో హరీశ్ రావు తనకు తానే సాటి అని, కల్వకుంట్ల కుటుంబంలో ‘‘ఏక్ నంబర్ చోర్ హరీశ్ రావేనని’’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిద్దిపేట పట్టణ పుర వీధుల గుండా రోడ్ షో, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన […]

Update: 2021-04-26 00:48 GMT

దిశ, సిద్దిపేట : అబద్దాలను అందంగా ప్రచారం చేయడంలో హరీశ్ రావు తనకు తానే సాటి అని, కల్వకుంట్ల కుటుంబంలో ‘‘ఏక్ నంబర్ చోర్ హరీశ్ రావేనని’’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిద్దిపేట పట్టణ పుర వీధుల గుండా రోడ్ షో, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో 14 వందల మందికి అగ్గిపెట్టే దొరికితే హరీశ్ రావు కి మాత్రం కిరోసిన్ దొరికింది కానీ అగ్గిపెట్టే దొరకలేదని ఎద్దేవాచేశారు. సిద్దిపేటకి రూ.138 కోట్లతో 2977 డబల్ బెడ్ రూం ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ప్రతి అభివృద్ధికి కేంద్రం నిధులను ఇస్తే టీఆర్ఎస్ వాటి పేరు మార్చి అది మేమే అభివృద్ధి చేశాం అని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. సిద్దిపేట మున్సిపల్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను మంత్రి హరీశ్ రావు ఏం చేసిండో చెప్పాలని ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణ అభివృద్ధి ప్రతి కార్యక్రమంలో కేంద్రం నిధులున్నాయని, నిధులు ఇచ్చే బీజేపీ పార్టీకి ఓటేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నెల 30 న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News