క్షీణిస్తున్న బండి సంజయ్ ఆరోగ్యం

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దీక్ష యథావిధిగా కొనసాగుతూనే ఉంది. 20 గంటలకు క్రితం దీక్ష ప్రారంభించిడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. క్రమక్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిసి బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పరిస్థితులపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సోమవారం రాత్రి తన పై సిద్దిపేట సీపీ దాడి చేశారని.. అతని పై చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్ దీక్ష చేస్తున్న విషయం […]

Update: 2020-10-27 05:02 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దీక్ష యథావిధిగా కొనసాగుతూనే ఉంది. 20 గంటలకు క్రితం దీక్ష ప్రారంభించిడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. క్రమక్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిసి బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పరిస్థితులపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సోమవారం రాత్రి తన పై సిద్దిపేట సీపీ దాడి చేశారని.. అతని పై చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.

Tags:    

Similar News