TRSపై మండిపడ్డ బండి సంజయ్.. ఆ పని చేశానని నిరూపిస్తారా ?
దిశ, డైనమిక్ బ్యూరో : హుజూరాబాద్‌లో ‘దళిత బంధు’ నిలిపివేయాలని భారతీయ జనతాపార్టీ లేఖ రాసిందంటూ టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెబుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు మద్దతుగా బండి సంజయ్ హుజూరాబాద్‌లో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తోందని, టీఆర్ఎస్ నాయకులే లేఖ రాసి పథకాలు ఆపించి బీజేపీపై నెట్టేస్తున్నారన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల ముందు […]
దిశ, డైనమిక్ బ్యూరో : హుజూరాబాద్‌లో ‘దళిత బంధు’ నిలిపివేయాలని భారతీయ జనతాపార్టీ లేఖ రాసిందంటూ టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెబుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు మద్దతుగా బండి సంజయ్ హుజూరాబాద్‌లో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తోందని, టీఆర్ఎస్ నాయకులే లేఖ రాసి పథకాలు ఆపించి బీజేపీపై నెట్టేస్తున్నారన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ నిలిపివేస్తుందని చెప్పడం టీఆర్ఎస్‌కి అలవాటే అన్నారు. దళితబంధు నిధులను లబ్దిదారులకు ఇవ్వాలని భాజపా డిమాండ్ చేస్తోందన్నారు. ‘‘ దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా?యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి సిద్ధమా? నాగార్జునసాగర్ ఎన్నిక తర్వాత గొర్రెల పంపిణీ పథకం ఆగిపోయింది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.