వరవరరావు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

ముంబై కోర్టులో విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌పై ఎన్‌ఐఏ తన వాదనలు వినిపించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని అతని తరుపు న్యాయవాదులు కోరారు. అయితే తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్లు కోర్టు వెల్లడించింది. కాగా, ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నారన్న అభియోగంతో వరవరరావు ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన్ను మహారాష్ట్రలోని ఎర్రవాడ జైలుకు తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని అతని తరుపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ […]

Update: 2020-06-26 07:11 GMT

ముంబై కోర్టులో విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌పై ఎన్‌ఐఏ తన వాదనలు వినిపించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని అతని తరుపు న్యాయవాదులు కోరారు. అయితే తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్లు కోర్టు వెల్లడించింది. కాగా, ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నారన్న అభియోగంతో వరవరరావు ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన్ను మహారాష్ట్రలోని ఎర్రవాడ జైలుకు తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని అతని తరుపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News