దూసుకొచ్చిన మృత్యు లారీ
దిశ, చిట్యాల: అతివేగంతో వస్తున్న లారీ.. ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. జూబ్లీనగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెల్ల తిరుపతి(42) కొత్తపల్లి వైపు వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులు చూసి […]
దిశ, చిట్యాల: అతివేగంతో వస్తున్న లారీ.. ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. జూబ్లీనగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెల్ల తిరుపతి(42) కొత్తపల్లి వైపు వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రోడ్డు మీద నుంచి కదిలేది లేదని భైఠాయించారు.