కోర్టు తీర్పును హర్షించిన ఆశాదేవి

        నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలి తల్లి ఆశాదేవి కొనియాడారు. కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరిగిందన్నారు. దోషులకు వారం రోజుల గడువు ఇస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. నిర్భయ దోషుల ఉరితీతపై ఉన్న స్టే ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది.         న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు […]

Update: 2020-02-05 23:41 GMT

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలి తల్లి ఆశాదేవి కొనియాడారు. కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరిగిందన్నారు. దోషులకు వారం రోజుల గడువు ఇస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. నిర్భయ దోషుల ఉరితీతపై ఉన్న స్టే ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది.

న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే, దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం చేయడంలో తాత్సారం చేయడాన్ని గతంలో నిర్భయ తల్లి తప్పుబట్టారు. కానీ ఈ తీర్పుతో దోషులకు ఉరితప్పదన్న నమ్మకం కలిగిందన్నారు.

Tags:    

Similar News