Sunscreen lotion: వింటర్‌లో సన్‌స్క్రీన్ లోషన్ కంటిన్యూ చేయొచ్చా.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పేవివే?
ప్రతిరోజూ మీ ముఖంపై సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ మీ ముఖంపై సన్‌స్క్రీన్(Sunscreen) అప్లై చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. సన్‌స్క్రీన్ UV కిరణాల(UV rays) నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్(Skin cancer) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా సన్ బర్న్స్(Sun burns) నివారిస్తుంది. అకాల వృద్ధాప్యా(old age)న్ని, మెలస్మాను, సన్‌స్పాట్(Sunspot)లను నివారిస్తుది. చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. అయితే చలికాలంలో సన్‌స్క్రీన్ లోషన్ కంటిన్యూ చేయొచ్చా..? లేదా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. ప్రతి రోజూ సన్‌స్క్రీన్ వాడే వారు చలికాలంలో రాసుకోకుండా ఉంటే మంచిదేనా? అనేవాటి గురించి స్కిన్ ఎక్స్ఫర్ట్స్ ఏమంటున్నారో చూద్దాం..
ఎండాకాలమైనా, చలికాలమైనా.. యూవీ కిరణాలు చర్మంపై పడతాయి. దీంతో స్కిన్ దెబ్బతినే చాన్స్ ఉంటుంది. సూర్యకిరణాలు ఏ కాలంలోనైనా ఒకే తీవ్రతను కలిగి ఉంటాయి. కాగా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోకపోవడం వల్ల డైరెక్ట్ చర్మంపై పడి స్కిన్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సన్‌స్క్రీన్ చర్మ క్యాన్సర్, ముడతలు(Wrinkles), పిగ్మంటేషన్(Pigmentation) వంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుందట. చర్మానికి యూవీ-ఏ, యూవీ -బీ కిరణాల నుంచి ఈ లోషన్లు పూర్తి రక్షణను ఇస్తాయి. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు వెంటనే రావు. కాగా ఎండాకాలంలోనే కాకుండా చలికాలంలో కూడా సన్‌స్క్రిన్ లోషన్లు అప్లై చేయడమే మేలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం బయటకెళ్తే మాత్రం కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కేవలం ఫేస్‌పైనే కాకుండా ఎండ తగిలే భాగాల(చేతులు, మెడ,చెవులు)పై కూడా అప్లై చేస్తే బెటర్.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More...
Face yoga : ఐదు నిమిషాలు చేస్తే చాలు .. మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది !