మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ

కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ అడవిలో జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు.

Update: 2024-12-21 14:55 GMT

దిశ, కాటారం : కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ అడవిలో జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. నాగార్జున రావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం. అభినవ్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కమలాపూర్ గ్రామానికి చెందిన కాల్వ శైలజ కు అంకుషాపూర్ గ్రామానికి చెందిన వెనుకాల రమేష్ తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, జలజకు బాకీ పడిన డబ్బులు ఇస్తానని పిలిపించుకొని మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇద్దరు కలుసుకున్నారన్నారు. అక్కడి నుంచి అడవి లోకి వెళ్లారని, ఒకరితో ఒకరు ఇద్దరు గొడవ పడ్డారని తెలిపారు.

ఇనుగల రమేష్ తాగినమైకంలొ ఆమెను కొట్టడంతో కాలువ శైలజ కింద పడిపోయిందని, ఆమె పై కూర్చుని ఇనుగాల రమేష్ ముక్కు, నోరు,మూసి గొంతు నులిమి చంపివేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని కొంత దూరం లాక్కెళ్ళి ఎండుటాకులను పైన కప్పి ఉంచారు. మృతురాలు కాలువ శైలజ తల్లి దుర్గమ్మ 17వ తేదీన కనిపించడం లేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాటారం పోలీస్ లు మూడు బృందాలుగా ఏర్పడి అందిన సమాచారంతో అడవిలో తీవ్రంగా గాలించారు. 20వ తేదీన మహిళా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నిందితుని కోసం గాలిస్తుండగా అంకుషాపు గ్రామ పెద్దల సహాయంతో నిందితుడు ఇనుగాల రమేష్ కోల్ కాటారం పోలీసులకు లొంగిపోయినట్లు సిఐ,ఎస్ఐ వివరించారు. శనివారం రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి అభినందించారు.


Similar News