గంజాయి సరఫరా చేస్తున్న నిందితులు అరెస్ట్
గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, జగిత్యాల టౌన్ : గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం డీఎస్పీ రఘు చందర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాలకు చెందిన కళ్యాణం ఉదయ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన మాడవి జనకరావు గంజాయి అమ్మడానికి వస్తుండగా పక్కా సమాచారం మేరకు స్థానిక రాజీవ్ బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 2 కేజీల 270 గ్రాముల గంజాయి పట్టుబడింది. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ వేణుగోపాల్, ఎస్సైలు గౌతమి, మన్మథరావు పాల్గొన్నారు.