మరో బ్రాండ్ ని సొంతం చేసుకున్న వీ-మార్ట్..

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అరవైంద్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు చెందిన అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ అన్నిటినీ వీ-మార్ట్‌కు విక్రయించినట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. వీ-మార్ట్ రిటైల్‌కు అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ విక్రయం పూర్తిగా నగదు లావాదేవీ రూపంలో జరిగినట్టు కంపెనీ పేర్కొంది. దీనిపై స్పందించిన వీ-మార్ట్ రిటైల్ లింటెడ్ ఎండీ లలిత్ అగర్వాల్.. భారత్‌లో బలమైన రిటైల్ సంస్థగా వీ-మార్ట్ కొనసాగుతోంది. ఫ్యాషన్ విభాగంలో ప్రజలకు […]

Update: 2021-07-22 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అరవైంద్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు చెందిన అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ అన్నిటినీ వీ-మార్ట్‌కు విక్రయించినట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. వీ-మార్ట్ రిటైల్‌కు అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ విక్రయం పూర్తిగా నగదు లావాదేవీ రూపంలో జరిగినట్టు కంపెనీ పేర్కొంది. దీనిపై స్పందించిన వీ-మార్ట్ రిటైల్ లింటెడ్ ఎండీ లలిత్ అగర్వాల్.. భారత్‌లో బలమైన రిటైల్ సంస్థగా వీ-మార్ట్ కొనసాగుతోంది.

ఫ్యాషన్ విభాగంలో ప్రజలకు అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ముఖ్యంగా తాము దేశీయంగా ఉన్న టైర్2, టైర్3 నగరాల్లో అధికంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో అరవింద్ లైఫ్‌స్టైల్స్ బ్రాండ్స్ అన్నిటినీ వీ-మార్ట్ కిందకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. అరవింద్ లైఫ్‌స్టైల్ దేశవ్యాప్తంగా 74 ఫ్యాషన్ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోందని, వీ-మార్ట్‌తో ఒప్పందంలో భాగంగా ఈ స్టోర్లతో పాటు, వేర్ హౌస్, ఇన్వెంటరీ, అన్‌లిమిటెడ్ బ్రాండ్లు వీ-మార్ట్ సొంతమవుతాయని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News