మహిళా పంచాయతీ కార్యదర్శికి షాకిచ్చిన సర్పంచ్ కుమారుడు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహమ్మదాబాద్ మండలం చౌదరి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనురాధ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్డు పనులు పూర్తి కావడం, పనులు చేసిన సర్పంచ్ కుమారుడు ఆంజనేయులు బిల్లులు డ్రా చేసుకునే క్రమంలో పంచాయతీ కార్యదర్శి తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆంజనేయులు ఏసీబీని ఆశ్రయించి విషయం చెప్పాడు. ఈ క్రమంలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అనురాధ తన స్వగృహంలో లంచం […]

Update: 2021-09-30 08:33 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహమ్మదాబాద్ మండలం చౌదరి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనురాధ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్డు పనులు పూర్తి కావడం, పనులు చేసిన సర్పంచ్ కుమారుడు ఆంజనేయులు బిల్లులు డ్రా చేసుకునే క్రమంలో పంచాయతీ కార్యదర్శి తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆంజనేయులు ఏసీబీని ఆశ్రయించి విషయం చెప్పాడు. ఈ క్రమంలో గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అనురాధ తన స్వగృహంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆమె వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News