‘ఆ నలుగురిపై కరీంనగర్ పోలీసులు కొరడా’
దిశ, కరీంనగర్: కరువు కాలంలో నిలువుదోపిడీ చేసి కాసులు సంపాదించాలనకున్న ఆ నలుగురిపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝులిపించారు. గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్, తిమ్మాపూర్ పోలీసులు జాయింట్ ఆఫరేషన్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన శివనాధుని రమేష్ గుట్టుచప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు జరుపుతున్నాడు. బుధవారం పక్క సమాచారంతో దాడులు నిర్వహించిన కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, తిమ్మాపూర్ పోలీసులు బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టగా […]
దిశ, కరీంనగర్: కరువు కాలంలో నిలువుదోపిడీ చేసి కాసులు సంపాదించాలనకున్న ఆ నలుగురిపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝులిపించారు. గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్, తిమ్మాపూర్ పోలీసులు జాయింట్ ఆఫరేషన్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన శివనాధుని రమేష్ గుట్టుచప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు జరుపుతున్నాడు. బుధవారం పక్క సమాచారంతో దాడులు నిర్వహించిన కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, తిమ్మాపూర్ పోలీసులు బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టగా రూ.2 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. గుట్కా రవాణా చేస్తున్న కారుతో పాటు శివనాదుని రమేష్, సిద్దిపేట జిల్లాకు చెందిన ఢీకొండ శాంతి కుమార్, మెడుదుల సురేష్, గందె లింగమూర్తిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా కర్నాటకలోని బీదర్ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.