మలక్‌పేట్ రేస్ కోర్స్‌లో విషాదం.. జాకీ మృతి
దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ రేస్ కోర్సులో విషాదం చోటు చేసుకుంది. మలక్‌పేట్ రేస్ క్లబ్‌లో రాజస్థాన్‌కు చెందిన జితేందర్ సింగ్ జాకీగా పని చేస్తున్నాడు. ఆదివారం జరుగుతున్న రేసుల్లో అతడు ఉస్మాన్‌సాగర్ ప్లేట్ డివిజన్-2 తరపున గుర్రాన్ని స్వారీ చేశాడు. నాలుగో రేసులో స్వారీ చేస్తుండగా గుర్రంపై నుంచి కిందపడిపోయాడు. సహాయక సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు చెప్పారు. రేస్ సమయంలో జితేందర్ […]
దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ రేస్ కోర్సులో విషాదం చోటు చేసుకుంది. మలక్‌పేట్ రేస్ క్లబ్‌లో రాజస్థాన్‌కు చెందిన జితేందర్ సింగ్ జాకీగా పని చేస్తున్నాడు. ఆదివారం జరుగుతున్న రేసుల్లో అతడు ఉస్మాన్‌సాగర్ ప్లేట్ డివిజన్-2 తరపున గుర్రాన్ని స్వారీ చేశాడు. నాలుగో రేసులో స్వారీ చేస్తుండగా గుర్రంపై నుంచి కిందపడిపోయాడు. సహాయక సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు చెప్పారు. రేస్ సమయంలో జితేందర్ గుండెపోటుకు గురై మరణించి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా నిర్దారించారు. అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్రెంటీస్‌గా రేస్ క్లబ్‌లో చేరిన జితేందర్.. సతీష్ అనే ట్రైనర్‌కు చెందిన గుర్రానికి జాకీగా వ్యవహరిస్తున్నాడు. చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.