వారం రోజుల్లో పీఆర్సీ.. ఉద్యోగులకు గుడ్ న్యూస్

దిశ, ఏపీ బ్యూరో: పీఆర్‌సీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్సీ ప్రక్రియ వారంలోపే పూర్తవుతుందని స్పష్టం చేశారు. పీఆర్సీ పెంపునకు సంబంధించి కసరత్తు జరుగుతుందని, వారంలోపే ఆ ప్రక్రియ పూర్తవుతుందని శుక్రవారం ప్రకటించారు. మరోవైపు ప్రధాన డిమాండ్ అయినటువంటి సీపీఎస్‌ రద్దు అంశంపై కమిటీల అధ్యయనం జరుగుతుందని వివరించారు. నెల రోజుల్లో కమిటీ అధ్యయనం పూర్తవుతుందని, ఆ తర్వాత సీపీఎస్‌పై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి […]

Update: 2021-12-10 08:30 GMT

దిశ, ఏపీ బ్యూరో: పీఆర్‌సీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్సీ ప్రక్రియ వారంలోపే పూర్తవుతుందని స్పష్టం చేశారు. పీఆర్సీ పెంపునకు సంబంధించి కసరత్తు జరుగుతుందని, వారంలోపే ఆ ప్రక్రియ పూర్తవుతుందని శుక్రవారం ప్రకటించారు. మరోవైపు ప్రధాన డిమాండ్ అయినటువంటి సీపీఎస్‌ రద్దు అంశంపై కమిటీల అధ్యయనం జరుగుతుందని వివరించారు. నెల రోజుల్లో కమిటీ అధ్యయనం పూర్తవుతుందని, ఆ తర్వాత సీపీఎస్‌పై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం వల్ల ఉద్యోగులకే నష్టం తప్ప ప్రభుత్వానికేం కాదని వ్యాఖ్యానించారు. ఇకపోతే ఓటీఎస్‌ పథకం పూర్తి స్వచ్ఛందమన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News