నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(AP Govt) నామినేటెడ్ పోస్టు(nominated posts)ను భర్తీ చేసింది.

Update: 2024-09-24 07:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం (AP Govt) నామినేటెడ్ పోస్టు (nominated posts)ను భర్తీ చేసింది. ఈ మేరకు మంగళవారం లిస్టు ప్రకటించారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా అబ్దుల్ హజీజ్, శాప్ చైర్మన్‌గా రవి నాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్‌గా తాతయ్య నాయుడు, ట్రైకార్ చైర్మన్‌గా శ్రీనివాసులు , మారి టైం బోర్డు చైర్మన్‌గా సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా లంక దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్‌గా కర్రోతు బంగారు రాజు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మన్యం సుబ్బారెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా మునిరత్న, టూరిజం చైర్మన్‌గా బాలాజీ, ఏపీఐఐసీ చైర్మన్‌గా మంతెన రామరాజు నియామకం అయ్యారు.


Similar News