Tirumala Laddu:లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్.. టీటీడీ క్లారిటీ ఇదే!
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం పై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం పై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల లడ్డూ ప్రసాదంలో పొగాకు ఉన్నట్లు కొంతమంది భక్తులు(Devotees) సోషల్ మీడియాలో వైరల్(Viral) చేయడం పై టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో పొగాకు ప్యాకెట్లు రావడం పూర్తిగా అవాస్తవం(Fake) అని తెలిపారు. తిరుమలలోని లడ్డూల పోటులో వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో, ప్రతిరోజు లక్షలాదిగా లడ్డూలను తయారు చేస్తారని ఆయన పేర్కొన్నారు. లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.