AP News:మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్

మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది.

Update: 2024-11-25 09:20 GMT

దిశ ప్రతినిధి,గోదావరి: మాజీ సీఎం జగన్‌కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. 2021లో పోలవరంలో నీటి నిల్వ 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా,41.15 మీటర్ల ఎత్తుకే తొలిదశ నీళ్లు నీటి నిల్వ ప్రతిపాదన మొదట జగన్ ప్రభుత్వమే ప్రతిపాదించిందని, పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చిచెప్పింది. సమాచార హక్కు కింద సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం అథారిటీ సమాధానమిచ్చింది. 2023లో కేంద్ర జలశక్తి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపై వైసీపీ, టీడీపీ నడుమ నడుస్తున్న మాటల యుద్దానికి చెక్ పెడుతూ అసలు విషయాలను కేంద్ర జలశక్తి మానిటరింగ్ కమిటీ ప్రకటించింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను గత ప్రభుత్వ కీలక విషయాలను వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో 2021 జులై 29న జరిగిన సమావేశంలో డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తుకే తొలుత నీళ్లు నిలబెడతామని జగన్ సర్కార్ కు ప్రతిపాదించింది.ఈ భేటీలో పోలవరం లో నీళ్ళు నిల్వ చేయడం, పునరావాసం ఏర్పాటు చేయడం అనే అంశాలను రెండు భాగాలుగా చేయాలని చర్చించారు. ప్రాజెక్టులో మొదట 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెట్టేలా,అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని, నిర్వాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశం లోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ పేర్కొంది. అయితే పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆనాడు సీఎంగా ఉన్న జగన్ ను కోరింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు అథారిటీ స్పష్టం చేసింది.

Tags:    

Similar News