‘సేవ్ తిరుమల..సేవ్ టీటీడీ’.. లడ్డూ వ్యవహారం పై తిరుమలలో స్వామీజీల నిరసన
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదం వివాదం పై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదం వివాదం పై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ (Tirumala Laddu) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాట పట్టారు. లడ్డూ వ్యవహారంలో తిరుమల అట్టుడుకుతోంది. లడ్డూ అపవిత్రం విషయంలో మఠాధిపతులు, హిందూ సంఘాలు, స్వామీజీలు టీటీడీ కార్యాలయం ముందు బైఠాయించారు. టీటీడీ ఈవోను కలవాలంటూ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గేటుకు తాళాలు వేసిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే.. రెండు తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం(Administration building) ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి(adulterated ghee) వినియోగం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా(Employees) నియమించవద్దని డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి తరదితరులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ నేపథ్యంలో ‘సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ’ నినాదాలతో హోరెత్తించారు. వారితో టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో గత పాలకమండలి పై చర్యలు తీసుకోవాలని ఈవోకు వినతిపత్రం అందించారు.