Supreme Court: అవినాశ్ రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా

వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది....

Update: 2024-09-24 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు (Viveka Murder Case) విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. వివేకా కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (Ycp Mp Avinash Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారించింది.అయితే అవినాష్‌, శివశంకర్‌రెడ్డి, అతని కుమారుడి కేసును కలిపి ఒకేసారి వినాలని వివేకా తరపు న్యాయవ్యాది సిద్ధార్థ్‌ లూథ్రా కోరారు. దీంతో ధర్మాసనం అంగీకరించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.

కాగా 2019 ఎన్నికలకు వైఎస్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారు. ఆ సమయంలో వివేకా హత్యపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సిట్ అధికారుల విచారణ జరిపారు. అయితే ప్రభుత్వం మారడంతో విచారణ నెమ్మదిగా కొనసాగింది. దీంతో వివేకానందారెడ్డి కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు. ఈ మేరకు సునీత విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించింది. దీంతో వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించింది. దీంతో విచారణ జరిపి పలువురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపైనా ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. 

అయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని జగన్ ప్రభుత్వం సహకరించకపోవడంతో అవినాశ్‌రెడ్డి అరెస్ట్ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోయింది. కానీ అవినాశ్ రెడ్డి మాత్రం సీబీఐ పలుమార్లు విచారించింది. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు సీబీఐ మాత్రం అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరుతోంది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు కొనసాగించింది. మరి నవంబర్ 5న ఎలాంటి ఆదేశాలు వస్తాయో చూడాలి.


Similar News