Vizag Railway Zone: విశాఖలో జోన్ కార్యాలయం.. టెండర్లు ఆహ్వానించిన రైల్వే శాఖ
విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ (Vizag Railway Zone Office) ఏర్పాటుకు కీలక అడుగు పడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దాంతో జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ షురూ అయింది. విశాఖలో నిర్మించే ఈ కార్యాలయాన్ని రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. డిసెంబర్ 27 లోగా టెండర్లను దాఖలు చేయాలని, టెండర్లు దక్కించుకున్నవారు భవన నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలన్న నిర్దేశాలు జారీ చేసింది.