సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన సజ్జల

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జలాల విషయంలో కేంద్రం తీరును అవకాశంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం తెలంగాణపై దాదాగిరి చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. నెల్లూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘‘జలాలపై ఎవరు దాదాగిరి చేస్తున్నారో.. ప్రజలు చూస్తున్నారు. జలశక్తి ఆదేశాలను కూడా తెలంగాణ పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్‌ పేరుతో 30 టీఎంసీలు […]

Update: 2021-08-02 11:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జలాల విషయంలో కేంద్రం తీరును అవకాశంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం తెలంగాణపై దాదాగిరి చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. నెల్లూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘‘జలాలపై ఎవరు దాదాగిరి చేస్తున్నారో.. ప్రజలు చూస్తున్నారు. జలశక్తి ఆదేశాలను కూడా తెలంగాణ పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్‌ పేరుతో 30 టీఎంసీలు సముద్రం పాల్జేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామనే భావనతో జలవివాదం తెరపైకి తీసుకువచ్చారని సజ్జల విమర్శించారు. ఏపీ నీటి వాటా కాపాడుకునేందుకే సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ కృష్ణా జలాల అంశంపై తీవ్రంగా స్పందించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ప్రజలందరూ చూస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలన్నదే తమ అభిమతమని.. అప్పుడే అందరూ సుభిక్షంగా ఉంటారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News