ఫ్లాష్ ఫ్లాష్ : ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్ ఆమోదం

దిశ, ఏపీబ్యూరో: గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే మండలిలో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయగా, ఖాళీలు ఏర్పడిన వాటికి అధికార పార్టీ వైసీపీ నలుగురు అభ్యర్థులను నామినేట్ చేసింది. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(కడప)ల పేర్లను ప్రతిపాదిస్తూ తుది జాబితాను గవర్నర్‌ ఆమోదానికి పంపింది. అయితే, ఫైల్ పంపి నాలుగు రోజులు అయినప్పటికీ గవర్నర్ ఆమోదం […]

Update: 2021-06-14 08:06 GMT

దిశ, ఏపీబ్యూరో: గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే మండలిలో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయగా, ఖాళీలు ఏర్పడిన వాటికి అధికార పార్టీ వైసీపీ నలుగురు అభ్యర్థులను నామినేట్ చేసింది. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(కడప)ల పేర్లను ప్రతిపాదిస్తూ తుది జాబితాను గవర్నర్‌ ఆమోదానికి పంపింది.

అయితే, ఫైల్ పంపి నాలుగు రోజులు అయినప్పటికీ గవర్నర్ ఆమోదం లభించలేదు. కాగా, సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైల్‌ను ఆమోదించాలని కోరారు. జగన్ విజ్ఞప్తితో ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News