Hurricane Helen: అమెరికాను వణికిస్తోన్న ‘హెలీన్’.. నాలుగు రాష్ట్రాల్లో 40 మంది దుర్మరణం
సౌత్ ఈస్ట్ అమెరికా రాష్ట్రాల్లో ‘హెలీన్’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఈస్ట్ అమెరికా (South East America) రాష్ట్రాల్లో ‘హెలీన్’ తుఫాను (Cyclone 'Helene') బీభత్సం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా వచ్చిన ఉపద్రవం ధాటికి జనజీవనం అస్తవ్యస్తం అవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ (Rescue Teams) నిరంతరం శ్రమిస్తున్నారు. అదేవిధంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఫిషింగ్‌ను జీవనాధారంగా చేసుకుని ఫ్లోరిడాలోని బిగ్‌బెండ్ (Bigbend) ప్రాంతంలో వేల మంది అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి తుఫాన్ తీరం దాటినప్పుడు గరిష్టంగా గంటకు 140 మైళ్ల (225 కి.మీ) వేగంతో బీభత్సమైన గాలులు వీచాయి. దీంతో దక్షిణ జార్జియా (South Georgia)లోని కొన్ని ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. ‘హెలీన్’ తుఫాన్‌తో దాదాపు 15 బిలియన్ డాలర్ల నుంచి 26 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.