ఏపీలో 19 ఆలయాలపై దాడులు : DGP

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరుసగా దేవాలయాలపై దాడులు జరగడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ, జనసేన పార్టీలు ధర్మ పరిరక్షణ దీక్షలు కూడా చేపట్టాయి. అయితే, తాజాగా ఏపీలో ఆలయాలపై జరిగిన దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 దేవాలయాలపై దాడులు జరిగాయని వివరించారు. ఇకపై ఆలయాలపై అలాంటి దాడులు జరగకుండా వాటి భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ దాడులకు […]

Update: 2020-09-28 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరుసగా దేవాలయాలపై దాడులు జరగడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ, జనసేన పార్టీలు ధర్మ పరిరక్షణ దీక్షలు కూడా చేపట్టాయి. అయితే, తాజాగా ఏపీలో ఆలయాలపై జరిగిన దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 దేవాలయాలపై దాడులు జరిగాయని వివరించారు.

ఇకపై ఆలయాలపై అలాంటి దాడులు జరగకుండా వాటి భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ దాడులకు సంబంధించి 12కేసులు నమోదు చేశామని, 7కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఆలయాలపై దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, అందువలనే అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు.

Tags:    

Similar News