ఏప్రిల్ 1న జగన్‌కు కరోనా వ్యాక్సిన్
దిశ, వెబ్‌డెస్క్: విడతలుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందించగా.. రెండో విడతగా 55 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. మూడో విడతగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు గుంటూరులోని భరత్ […]
దిశ, వెబ్‌డెస్క్: విడతలుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందించగా.. రెండో విడతగా 55 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. మూడో విడతగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 1న కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ప్రకటించారు.