అప్పుల బాధతో మరో యువ కౌలు రైతు ఆత్మహత్య..
దిశ, హాలియా: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో ఎలా తీర్చాలో అర్థం కాక మానసిక ఒత్తిడికి లోనై రైతు యువ రైతు ఆత్మహత్య. వీర్లగడ్డ గ్రామానికి చెందిన దేపావత్ లక్ష్మణ్ (25) అతనికి ఉన్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో తగిన పంట దిగుబడి రాక పోవడంతో పంటకు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలిక […]
దిశ, హాలియా: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో ఎలా తీర్చాలో అర్థం కాక మానసిక ఒత్తిడికి లోనై రైతు యువ రైతు ఆత్మహత్య. వీర్లగడ్డ గ్రామానికి చెందిన దేపావత్ లక్ష్మణ్ (25) అతనికి ఉన్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో తగిన పంట దిగుబడి రాక పోవడంతో పంటకు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలిక మంగళవారం రోజు రాత్రి సమయంలో తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని చిన్నమ్మ కొడుకు రమావత్ నాగేంద్ర నాయక్ యొక్క ఫిర్యాదు మేరకు హాలియా శివ కుమార్ కేసు నమోదు చేశారు.