మావోలకు వ్యతిరేకంగా మరో కమిటీ!
దిశ ప్రతినిది, కరీంనగర్: మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ వేదికగా మరో కమిటీ జన్మించింది. గ్రీన్ టైగర్ పేరిట గతంలో వెలిసిన సంస్థల మాదిరిగానే ఈ సంస్థ కూడా మావోయిస్టులను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ భరత్ పేరిట విడుదలైన ఓ వాయిస్ రికార్డు వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యులు జగన్, హరిభూషన్ ల ప్రకటనలపై కమిటీ బాధ్యుడు భరత్ హెచ్చరికలు చేశారు. చత్తీస్ గడ్ లో అమాయక గిరిజనులను […]
దిశ ప్రతినిది, కరీంనగర్: మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ వేదికగా మరో కమిటీ జన్మించింది. గ్రీన్ టైగర్ పేరిట గతంలో వెలిసిన సంస్థల మాదిరిగానే ఈ సంస్థ కూడా మావోయిస్టులను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ భరత్ పేరిట విడుదలైన ఓ వాయిస్ రికార్డు వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యులు జగన్, హరిభూషన్ ల ప్రకటనలపై కమిటీ బాధ్యుడు భరత్ హెచ్చరికలు చేశారు. చత్తీస్ గడ్ లో అమాయక గిరిజనులను క్రూరంగా హింసించి హత్య చేసి ఇన్ ఫార్మర్లుగా ముద్ర వేశారని ఆరోపించారు. అలాగే తెలంగాణ రాజకీయ నాయకులే లక్ష్యంగా మావోయిస్టు పార్టీ హెచ్చరికలు జారీ చేయడంపై కూడా భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకుల్ని కాపాడుకుంటామని మావోయిస్టులను కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల అరాచకాలను కొనసాగించే ప్రసక్తి లేదని మావో నేతలకు సంబంధించిన ప్రతి ఒక్కరి చిట్టా తమ వద్ద ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కూడా భరత్ తన వాయిస్ రికార్డులో స్పష్టం చేశారు.