Ys Vivekananda Reddy Murder Case: పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం

పులివెందుల కోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. అయితే అసలు నేరస్తులను వదిలివేసి అమాకులను అరెస్ట్ చేశారని ఆయన భార్య తులసమ్మ ఆరోపించారు. ...

Update: 2022-11-26 12:20 GMT

దిశ వెబ్ డెస్క్: పులివెందుల కోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు  విచారణ జరిగింది. ఈ కేసులో శివశంకర్ రెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. అయితే అసలు నేరస్తులను వదిలివేసి అమాయకులను అరెస్ట్ చేశారని ఆయన భార్య తులసమ్మ ఆరోపించారు. అసలు నేరస్తులను కూడా అరెస్ట్ చేయాలని ఫిబ్రవరి 21న పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తుపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. 9 నెలల తర్వాత ఇవాళ పులివెందుల కోర్టు తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వివేకా కుటుంబీకులే ఆయనను హత్య చేశారని కోర్టుకు తులసమ్మ తెలిపారు. వివేకా హత్యలో మరో ఆరుగురుకి కూడా సంబంధాలున్నాయని.. వారినీ విచారించాలని కోరారు. తన భర్త శివ శంకర్ రెడ్డిని ఇరికించారని తులసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

READ MORE

వైసీపీ కొత్త పథకం 'జగనన్న అన్యమత ప్రచారం' 

Tags:    

Similar News