Breaking: కడప జిల్లాలో కాల్పుల కలకలం.. ఉద్రిక్తత

గ్రావెల్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది...

Update: 2024-07-29 16:14 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రావెల్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కడప జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండాపురం మండలం కోడూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ వర్గం నేత గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.  రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి నుంచి తుపాకీతో పాటు 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. స్థానికంగా పవర్ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణానికి పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గ్రావెల్ తరలిస్తున్నారు. అదే గ్రామానికి రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. గ్రావెల్ తోలుతున్న వాహనాలను  గ్రామ సమీపంలో అడ్డుకోవడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది మరింత పెరిగి ఇరు వర్గీయులు రాళ్ల దాడి చేసుకున్నారు. అనంతరం పవన్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కానీ రామ్మోహన్ రెడ్డి వర్గీయులు అంతటి ఆగలేదు. పవన్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. రామ్మోహన్ రెడ్డి తన వద్దనున్న లైసెన్స్‌డ్ గన్‌తో పవన్ కుమార్ ఇంట్లో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టీవీ, ఫ్రిజ్ ధ్వంసం అయ్యాయి.

అయితే పోలీసులు వెంటనే పవన్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి వర్గీయులను కొండాపురం పోలీస్ స్టేషన్‌కు,  పవన్ కుమార్ రెడ్డి వర్గీయులను తాళపు పీఎస్‌కు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వడంలేదు. ఇతరులను గ్రామంలోకి రానివ్వడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

Tags:    

Similar News