ప్రజా సమస్యలు తెలుసుకునే తీరిక కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా..?

చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Update: 2024-01-23 09:19 GMT

దిశ వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న, వాళ్ళల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ సమావేశం దరిదాపులకు కూడా వెళ్ళలేదు. కేవలం ఎంపీ రెడ్డప్ప ఒక్కరే సమావేశానికి హాజరైయ్యారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశానికి రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరు కాకపోవడం చేత సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునే తీరిక కూడా ఎమ్మెల్యేలకు లేదా..?

ప్రజా సమస్యలు అంత చులకనైపోయాయా..? అని అటు సభానిర్వాహకులు ఇటు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాకపోవడానికి అభ్యర్థుల ప్రకటనే కారణమా? లేక ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా..? ఈ కారణాల చేతనే ఎమ్మెల్యేలు ఎవరు సమావేశానికి హాజరు కాలేదా..? అనే ప్రశ్నలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

 

Tags:    

Similar News