High Court: సజ్జలకు భారీ ఊరట.. మధ్యంతర ఉత్తర్వుల జారీ

వైసీపీ నేత, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది..

Update: 2024-10-04 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (YCP leader Sajjala Ramakrishna Reddy)కి హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసు(Mangalagiri TDP office Attack Case)లో ఆయన నిందితులుగా ఉన్నారు. దీంతో తనకు ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదన విన్న కోర్టు.. సజ్జలపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని సజ్జలను ఆదేశించారు. ఇక సజ్జల బెయిల్‌కు సంబంధించిన విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

పిటిషన్‌లో సజ్జల దాఖలు చేసిన అంశాలు ఇవే..

హైకోర్టులో దాఖలు చేసిన పటిషన్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పలు అంశాలను దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సహ నిందితులు ఇచ్చిన వాగ్మూలంతో తనను 120వ నిందితుడిగా పోలీసులు చేర్చాలని తెలిపారు. తనపై కూటమి ప్రభుత్వం కేసు పెట్టి వేధిస్తోందని, అందులో భాగంగానే సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసుల నిబంధన ప్రకారం రక్షణ పొందకుండా ఉండేందుకే తనపై హత్యాయత్నం కేసు పెట్టారని ఆరోపించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో సజ్జల పేర్కొన్నారు


Similar News