Minister Payyavula Keshav:‘పార్టీ కోసం కష్టపడినా వారికే పదవులు’.. మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చలు జరిపామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) తెలిపారు.

Update: 2024-11-28 10:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చలు జరిపామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) తెలిపారు. నేడు(గురువారం) అనంతపురం జిల్లాలో జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 14 టీడీపీ ఎమ్మెల్యేలను(TDP MLAs) గెలిపించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు(Irrigation project)లను పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో సాగునీటి ఎన్నికల పై చర్చించమని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో పదవులు ఇచ్చే విధానంలో పార్టీ కోసం పోరాడిన వారికే దక్కేలా చూస్తాం అన్నారు. పదవులు ఎమ్మెల్యేల సిఫార్సు, లెటర్ వల్ల కాకుండా పార్టీ కోసం కష్టపడినా వారికే దక్కాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. ఈ క్రమంలో అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాతే విద్యుత్ ఒప్పందాల(Electricity contracts)పై ప్రభుత్వ వైఖరి తెలియజేస్తామని మంత్రి పయ్యావుల తెలిపారు. విద్యుత్ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు(CM Chnadrababu) స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ అంశంపై గతంలో నేను హైకోర్టుకు కూడా వెళ్లానని గుర్తు చేశారు. కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడితే బాగుండదు అన్నారు. ఆర్థిక, న్యాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి(Chief Minister) ప్రకటన మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు. ఇక ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్(Minister TG Bharath), ఎమ్మెల్యే లు పలువురు నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News