Gudivada Amarnath:‘ఆరు నెలల్లో రూ.60వేల కోట్ల అప్పు’.. ప్రభుత్వం పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-11-28 12:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(గురువారం) విశాఖలో వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Former minister Gudivada Amarnath) మహాత్మ జ్యోతిరావు పూలే(Mahatma Jyoti Rao Phule) వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం మహాత్మ జ్యోతిబాపూలె ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ క్రమంలో బీసీల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని తెలిపారు.

వైఎస్ జగన్(YS Jagan) రాజ్యసభ పదువుల్లో బీసీలకు అవకాశం కల్పించారని తెలిపారు. ఈ క్రమంలో గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వం(AP Government) పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మంగళవారం అప్పుల రోజుగా మారిపోయిందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.60 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ(Mega DSC) ఏమైంది? ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంటూ విమర్శించారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఊసే లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పరవాడ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News