ఆ వివరాలు బయటపెట్టు.. లేదంటే సారీ చెప్పు: జగన్‌‌కు సత్యకుమార్ సంచలన సవాల్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ సంచలన సవాల్ విసిరారు.

Update: 2024-11-28 14:12 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy) అన్ని అబద్దాలు చెబుతున్నారని మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైద్యశాఖలో 52 వేలు రిక్రూట్ మెంట్లు చేపట్టినట్లు జగన్ చెబుతున్నారని, ఆ వివరాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. అలా చేయని పక్షంలో జగన్ క్షమాపణలు చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ జీరో వేకెన్సీ విధానంపై జగన్ మరోసారి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తాను నిర్వహించిన సమీక్షలో మెడికల్ కాలేజీల్లో 2 వేల అధ్యాపకుల కొరత ఉందని తేలిందని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత 4 శాతమే ఉందని జగన్ చెబుతున్నారని, అది పచ్చి అబద్ధమన్నారు. 59 శాతం డాక్టర్ల కొరత ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి అబద్ధాలతో ప్రజలను నిందించే బదులు జగన్ తన అసహాన్ని, నిరాశ, భ్రమలను అధిగమించే ప్రయత్నం చేయాలని సత్యకుమార్ సూచించారు. 

Tags:    

Similar News