"హేవ్ లాక్"బ్రిడ్జికి నిధులు విడుదల చేసిన కేంద్రం

ఉభయగోదావరి జిల్లాల వారధిగా శతాబ్ద కాలంగా సేవలందిస్తున్న గోదావరి వంతెన పైనున్న రాజమండ్రి హేవ్ లాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది.

Update: 2024-11-28 09:52 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ: ఉభయగోదావరి జిల్లాల వారధిగా శతాబ్ద కాలంగా సేవలందిస్తున్న గోదావరి వంతెన పైనున్న రాజమండ్రి హేవ్ లాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. టూరిజం పరంగా అభివృద్ధి చేయడంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్స్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా రూ.62.33 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఈ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే కేంద్రం రూ.94.44 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నిధులు వ్యయం చేసిన అనంతరం మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు.


Similar News