వైసీపీలో అవమానాలు.. టీడీపీలోకి కీలక నేత

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి...

Update: 2025-03-20 11:56 GMT
వైసీపీలో అవమానాలు.. టీడీపీలోకి కీలక నేత
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp)కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. కొన్ని సిటీల్లో కార్పొరేటర్లు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. తెలుగుదేశం(Telugudesam), జనసేన(Janasena) పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్(Mlc Marri Rajasekhar) రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నానని, తన పదవికి నాలుగేళ్ల కాలం ఉన్నప్పటికీ తాను రాజీనామా చేస్తున్నానని రాజశేఖర్ తెలిపారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర శానసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు అందజేశారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామా చేశారు. ప్రస్తుతం మర్రి రాజశేఖర్ సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

కాగా చిలకలూరిపేట ఇంచార్జి మాజీ మంత్రి విడదల రజినీ కారణంగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2019లో చిలకలూరి పేట నుంచి ఆ తర్వాత 2024లో గుంటూరుకు విడదల రజినీ వెళ్లడం, మళ్లీ పార్టీ ఇంచార్జిగా చిలకలూరిపేటకు రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందిన సమాచారం. అయితే మర్రి రాజశేఖర్‌కి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎంత బుజ్జగించినా రాజీనామాపై వెనక్కి తగ్గలేదు. పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శేఖర్ తెగేసి చెప్పారు. రాజీనామా చేసి శాసనమండలి చైర్మన్‌కు పంపారు.

Tags:    

Similar News