Earth Hour:‘ఓ గంట పాటు లైట్లు ఆపేయండి’.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు
"ఎర్త్ అవర్" అనేది పర్యావరణ(environmental) అవగాహన కోసం ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: "ఎర్త్ అవర్" అనేది పర్యావరణ(environmental) అవగాహన కోసం ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం కోసం విద్యుత్ లైట్లు ఓ గంట పాటు ఆపివేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపు నిచ్చారు.
ఇవాళ(మార్చి 22) ఎర్త్ అవర్(Earth Hour) సందర్భంగా గంటపాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని సీఎం చంద్రబాబు చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పులకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.