‘డీలిమిటేషన్‌పై వారి మౌనం సరికాదు’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.

Update: 2025-03-22 09:31 GMT
‘డీలిమిటేషన్‌పై వారి మౌనం సరికాదు’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. జనాభా ఆధారంగా సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని ఆమె తెలిపారు. సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురు కాక తప్పదని ఆమె హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ఈ క్రమంలో జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తానంటే అంగీకరించే ప్రసక్తే లేదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే.. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144. ఇది కాదా వివక్ష చూపడం అంటే? అని షర్మిల ప్రశ్నించారు. యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే.. సౌత్ మొత్తం తిప్పి కొట్టిన 192 సీట్లకే పరిమితం. ఇది కాదా దక్షిణ భారత్‌కి జరిగే అన్యాయం? అని ఆమె నిలదీశారు. ఈ తరుణంలో సౌత్‌లో చేసే మొత్తం సీట్ల పెంపు, బిహార్, యూపీలోని సీట్ల పెంపు కన్నా తక్కువేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేనని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Tags:    

Similar News