AP Deputy CM: ‘కుంటల చుట్టూ ఆ మొక్కలు పెంచండి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రపంచ జల దినోత్సవం(World Water Day) సందర్భంగా కర్నూలు జిల్లా(Kurnool District), ఓర్వకల్లు మండలం, పూడిచర్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Update: 2025-03-22 08:29 GMT
AP Deputy CM: ‘కుంటల చుట్టూ ఆ మొక్కలు పెంచండి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రపంచ జల దినోత్సవం(World Water Day) సందర్భంగా కర్నూలు జిల్లా(Kurnool District), ఓర్వకల్లు మండలం, పూడిచర్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్ కు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేశామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం(National Employment Guarantee Scheme)లో భాగంగా 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయింది. నీటి నిల్వ కోసం వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తామని అన్నారు.

పల్లె పండుగ విజయానికి బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే సాధ్యమైంది. వంద మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామన్నారు. అలాగే గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని తెలిపారు. కుంటల చుట్టూ అరటి, నిమ్మ, దానిమ్మ వంటి మొక్కలు పెంచితే.. రైతులకు దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. గత వైసీపీ(YSRCP) హయాంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు.

ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు రూ.9.597 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘‘గెలుపులోనే మనుషులను లెక్కించం.. కష్ట సమయంలోనూ ఎలా ఉన్నారనే చూస్తాం’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. కష్ట సమయంలో బలంగా నిలబడి.. ఈ విజయం సాధించామని అన్నారు. ఈ విజయం(Success) రాష్ట్ర ప్రజలు, యువత, మహిళలకు దక్కుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News