చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్.. జనసేన కీలక లేఖ విడుదల
కేంద్రప్రభుత్వం ప్రతిపాదన చేసిన డీలిమిటేషన్(Delimitation)ను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది..

దిశ, వెబ్ డెస్క్:కేంద్రప్రభుత్వం(Central Government) ప్రతిపాదన చేసిన డీలిమిటేషన్(Delimitation)ను తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Government)వ్యతిరేకిస్తోంది. 2026 జనాభా లెక్కల(2026 Census) ప్రకారం నియోజకవర్గాలను పునవర్విభజన(Constituencies Redistribution) చేసేందుకు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. జాతీయ స్థాయిలో ఉద్యమం చేసేందుకు స్టాలిన్ సంసిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. కానీ ఈ సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది.

దీంతో జనసేన(Janasena) పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. తాము స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదని లేఖ విడుదల చేశారు. చెన్నై(Chennai)లో నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశానికి(All Party Meeting) హాజరుకావాలని తమకు ఆహ్వానం అందిందని తెలిపారు. కానీ తాము హాజరుకాలేమని సమాచారం అందించామని చెప్పారు. జనసేన హాజరైనట్లు వస్తున్నట్లు వార్తలు ఊహాగానాలని స్పష్టం చేశారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున్న సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియజేయాలని తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) దిశానిర్దేశం చేశారని, ఈ మేరకు తాము సమాచారం అందించామని తెలిపారు. డీలిమిటేషన్ పై వారి అభిప్రాయం వారికి ఉన్నట్లే-తమకూ ఓ విధానం ఉందని, ఈ విషయాన్ని సరైన వేదికపై వెల్లడిస్తామని లేఖలో పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది... హాజరు కాలేమని సమాచారమిచ్చాము pic.twitter.com/w1J0GWOyjp
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2025