ఎవరి కోసం కొత్త జిల్లాలు.. జిల్లాల విభజన తో ఏం సాధిస్తారు: బోండా ఉమ

Update: 2022-01-28 17:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: జిల్లాల విభజన పట్ల టీడీపీ నేత బోండా ఉమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, విభజనవల్ల ఎవరికైనా ఉపయోగముందా అని నిలదీశారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదనీ, ఇప్పుడు కొత్త జిల్లాలు చేసి ఏం సాధిస్తారని ధ్వజమెత్తారు. క్యాసినో వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే జిల్లాల విభజన తెరపైకి తెచ్చారన్నారు.

కొత్త జిల్లాలకు ప్రజాభిప్రాయం తెలుసుకొకుండానే పేర్లు పెట్టారని ధ్వజమెత్తారు.తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందన్నారు.అదేవిధంగా ఏలూరు జిల్లాకు మహానటుడు ఎస్వీ రంగారావు పేరును, తూర్పుగోదావరి నుంచి ఏర్పాటయ్యే జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో సమతుల్యత లేదని బోండా ఉమ ఆరోపించారు.

Tags:    

Similar News