మోడీ నాయకత్వంలో దేశం గర్వించేలా పని చేస్తాం: టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు

నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం గర్వించేలా పని చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2024-06-05 16:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం గర్వించేలా పని చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అనంతరం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరిగిందని తెలిపారు. దేశ ప్రజల ఎన్నికల తీర్పును అనుసరించి, ఎన్డీయే కూటమి నాయకుడిగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాల నేతలందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని అన్నారు. నరేంద్ర మోడీ లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో మన దేశం అభివృద్ధి పథంలో పయనించేలా, ప్రపంచానికే మార్గదర్శిలా భారత్ ఎదిగేలా కృషి చేస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ మేరకు చంద్రబాబు ఎన్డీయే భేటీ ఫొటోలను కూడా షేర్ చేశారు. 


Similar News