Ap News: తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందా?.. పేర్ని నాని సెటైర్లు
వైసీపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం మరింత పెరిగింది...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దీంతో వైసీపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం మరింత పెరిగింది. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వెనక్కి తగ్గడంతో ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పోరాటం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అంటుంటే ఇందుకు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణపై సామెతలతో పేర్ని నాని విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై కేటీఆర్ ప్రకటనపై విమర్శలు చేశారు. తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు. సింగరేణిపై ఎందుకు దిగిరాలేదు అంటూ ప్రశ్నించారు. వాళ్ల మధ్య ఉన్న కేసులే తేల్చుకోలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.