కాకాపుట్టిస్తున్న విజయవాడ వెస్ట్ సీటు.. బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ సీటు ఎవరికి దక్కుతుంది అనే విషయం అందరిలోనూ ఉత్కంఠను రెక్కెతిస్తోంది. ఓ వైపు విజయవాడ వెస్ట్ సీట్ తమదే అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరో వైపు విజయవాడ వెస్ట్ తమకే కావాలని జనసేన పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ సీటు తమదే అని చెబుతూ.. ఈ రోజు బీజేపీ విజయవాడ వెస్ట్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీటు ఎవరికి కేటాయించాలి అనే అంశంపై చర్చలు ముగిశాయని తెలిపారు. మూడు పార్టీల అధినేతలు ఎవరికి ఏఏ సీట్లు ఇవ్వాలి అనే అంశంపై చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఇక పార్టీ అభ్యర్థి ఎవరని తేలాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అయితే అభ్యర్ధిని నిర్ణయించే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వంపై ఉంచడం జరిగిందని తెలిపారు.
అయితే అభ్యర్థి ఎవరైనప్పటికీ విజయవాడ వెస్ట్ లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక కార్యకర్తలు అందరూ చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ మిత్ర పార్టీలతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక ప్రజలు నమ్మే పార్టీ బీజేపీ అని తెలిపారు.
ఇక 2014లో విజయవాడ వెస్ట్ నుండి కేవలం 3000 వేల ఓట్లతో ఓడిపోయిన బీజేపీ రానున్న 2024ఎన్నికల్లో 30 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక 2014 పొత్తు లెక్కల ప్రకారం విజయవాడ వెస్ట్ సీట్ బీజేపీకే వస్తుందని పేర్కొన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన తమ వెంట నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More..
AP News: ఆరుగురు వలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!?