TTD: కల్తీ నెయ్యి అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం:టీటీడీ ఈవో
తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు(Animal Fat) వాడారని ఏపీ సీఎం(Ap CM) చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్:తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు(Animal Fat) వాడారని ఏపీ సీఎం(Ap CM) చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి(Adulterated Ghee) వాడటంపై హిందువులు ఆందోళనలకు గురవుతున్నవేళ తాజా పరిస్థిని టీటీడీ ఈవో శ్యామలరావు(TTD EO Shyamala Rao) వివరించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం దేశవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని శ్యామలరావు పేర్కొన్నారు.కల్తీ వస్తువులను అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, స్వచ్చమైన నెయ్యిని ప్రముఖ సంస్థలు ద్వారానే కొనుగోలు చేస్తామని వెల్లడించారు.ప్రస్తుతం నందిని(Nandini), అల్పా ఫుడ్స్(Alfa Foods) ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తునట్టు తెలిపారు.నెయ్యి నాణ్యతను పరిశీలించిన తరువాతే కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.
నెయ్యి విషయంలో 18 మందితో సెన్సరి ప్యానల్‌ను ఏర్పాటు చేశామని.. వారి ద్వారా ప్రతి రోజూ టెస్టింగ్ విధానాన్ని నిర్వహిస్తామన్నారు.ఎన్ఏబీయల్ ల్యాబ్(NABL Lab) ద్వారా టెస్టింగ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. 75 లక్షల రూపాయల వ్యయంతో ఎన్ఏబీయల్ తరహాలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్‌ఎస్ఎస్‌ఎల్‌ఏ(FSSLA) వారి ఆధ్వర్యంలో కూడా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. కల్తీ వస్తువుల వల్ల వచ్చిన దోషాల నివారణకు ఆగష్టులో పవిత్ర ఉత్సవాలు నిర్వహించామని భక్తులు ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.