Trending: విశాఖలో సందడి చేస్తున్న ‘రెడ్ బుక్’ హోర్డింగ్స్.. లోకేష్ వాళ్లందరిని ఆట ఆడిస్తాడా?
‘రెడ్ బుక్’ రాష్ట్రం అంతటా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: ‘రెడ్ బుక్’ రాష్ట్రం అంతటా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. యువగళం పాదయాత్రలో భాగంగా వైసీపీ నాయకులు, నేతల చెప్పుడు మాటలు విని నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన వారి పేర్లు రెడ్ బుక్ నమోదు చేస్తున్నానని పలుమార్లు లోకేష్ చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అందరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, అప్పట్లో ఆయన మాటలను వైసీపీ నేతలు, కొందరు ఉద్యోగులు, అధికారులు ఎవరూ పట్టించుకోకుండా హేళన చేశారు. ఎన్నికలు దగ్గర పడినా కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారడంతో వారంతా అందులో కొందరు ఉద్యోగులు అధికారులు తమ పేర్లను లోకేశ్ రెడ్ బుక్‌లో నమోదు చేసుకుంటున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే విశాఖచ, మంగళగిరి పట్టణాల్లో ఏర్పాటు చేసిన రెడ్‌బుక్ హోర్డింగ్స్ ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్‌బుక్ ఓపెన్ చేసేందుకు సిద్ధమంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలతో హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. అయితే, నిజంగానే లోకేష్ రెడ్‌బుక్‌లో రాసిన విధంగా చర్యలు తీసుకుంటారా.. లేక వారిని ఓ ఆట ఆడిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.