రాజీ వద్దు.. చర్యలు తీసుకోండి: టీటీడీ ఈవోకు పవన్ ఆదేశం

తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై రాజకీయ దుమారం రేగింది..

Update: 2024-09-22 10:11 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులు కలిశాయని నిర్ధారణ కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pawan Kalyan) సీరియస్ అయ్యారు. వెంకటేశ్వరస్వామి(Venkateswara Swamy)ని క్షమించాలని కోరుతూ గుంటూరు జిల్లా నంబూరు (Guntur District Namburu)లో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అయితే పవన్ కల్యాణ్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదివారం మధ్యాహ్నం (TTD EO Syamala Rao) కలిశారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడంపై పవన్ కల్యాణ్‌కు వివరించారు. గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో తెలిపారు. దీంతో పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ వద్దని ఈవోను పవన్ ఆదేశించారు.


Similar News